గచ్చిబౌలిలో ఐటీ అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన సెక్యూరిటీ గార్డ్

గచ్చిబౌలిలో ఐటీ అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన సెక్యూరిటీ గార్డ్

హైదరాబాద్ సిటీ గచ్చిబౌలిలో పట్టపగలు ఓ వింత ఘటన జరిగింది. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తోంది. అమ్మాయి వయస్సులో 24 ఏళ్లు. 2026, సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం.. ఆఫీసుకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఇందిరానగర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది ఆ ఉద్యోగిని.

అదే సమయంలో క్యాబ్ వచ్చింది. వచ్చిన క్యాబ్ ఎక్కుతున్న సమయంలో.. ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్.. ఆ అమ్మాయికి బలవంతంగా ముద్దు పెట్టాడు. నడి రోడ్డుపై.. చుట్టూ అందరూ ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ అమ్మాయి షాక్ అయ్యింది. గట్టిగా అరుస్తూ కేకలు వేసింది ఆ ఐటీ ఉద్యోగిని. 

ఐటీ అమ్మాయి పెద్ద కేకలు వేయటంతో భయపడిన ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది ఆ అమ్మాయి. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. అతన్ని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.