బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. 16 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 14 మంది సభ్యులు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు , హౌస్‌లోని ఈక్వేషన్లను పూర్తిగా మార్చేసేందుకు మేకర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా 'అగ్నిపరీక్ష' షో నుంచి ముగ్గురు లేదా నలుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వినిపిస్తున్న పేర్ల ప్రకారం.. అపూర్వ, రామకృష్ణ, మిథిలేష్, దీపక్ రేసులో ఉన్నారు. అయితే వీరిలో అపూర్వ, రామకృష్ణల ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లేనని సమాచారం.
ముఖ్యంగా రామకృష్ణకు 'అగ్నిపరీక్ష2'ముగిసే సమయానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన సింపతీ లభించింది. కానీ ఆయన ప్రారంభంలోనే హౌస్‌లోకి రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆయన అడుగుపెడితే హౌస్‌లో సరికొత్త వైబ్ రావడం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు అపూర్వ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండటంతో హౌస్‌లో డ్రామా మరింత పీక్స్‌కు చేరనుంది. 'అగ్నిపరీక్ష2'లో రోహిత్‌తో ఆమెకున్న విభేదాలు, ఇప్పుడు హౌస్‌లోని రోహిత్, శాలిని, సృష్టి మధ్య ఉన్న బాండింగ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
బిగ్ బాస్ గేమ్‌లో తొలి వారాల్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడం అనేది ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్లకు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు. పాత స్నేహాలు తెగిపోయి, కొత్త శత్రుత్వాలు రూపుదిద్దుకోవడానికి ఈ ఎంట్రీలు ఆజ్యం పోస్తాయి. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ సీజన్ 10 నెక్స్ట్ లెవెల్‌కు చేరడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్..
