జపాన్ వాళ్లు తోపులు: మమ్మల్ని భయపెట్టారు.. శ్రేయస్ షాకింగ్ కామెంట్స్!

జపాన్ వాళ్లు తోపులు: మమ్మల్ని భయపెట్టారు.. శ్రేయస్ షాకింగ్ కామెంట్స్!

Shreyas Iyer: సానో వేదికగా జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక 5 ఓవర్ల టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. జపాన్ స్పిన్నర్ల ధాటికి భారత స్టార్ బ్యాటర్లు తడబడటంతో టీమిండియా 5 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్‌లో జపాన్ జట్టు విజయం అంచుల దాకా వచ్చినప్పటికీ, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ 8 పరుగులను సమర్థవంతంగా కాపాడటంతో జపాన్ 30/3 స్కోరుకే పరిమితమైంది. భారత్ - జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ చారిత్రక విజయం, మ్యాచ్ అనుభవాలపై భారత కెప్టెన్ శ్రేయస్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

3 గంటల ప్రయాణం.. వర్షం అంతరాయం: 

* ప్రయాణ అలసట, వర్షం: మ్యాచ్ జరిగే స్టేడియానికి చేరుకోవడానికి మేం ఏకంగా 3 గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. దానికి తోడు వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమై 5 ఓవర్లకు కుదించబడింది. అయినప్పటికీ అభిమానులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడగలగడం ఆనందంగా ఉందన్నాడు. 

* ఫ్యాన్స్ కోసమే ఆడాం: మా మనసులో ఒకటే ఆలోచన ఉంది.. ఎలాగైనా మైదానంలోకి దిగి మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రేక్షకాభిమానులను అలరించాలనుకున్నాం.. ఈ మ్యాచ్ నిర్వహణలో భాగమైన ప్రతి ఒక్కరికీ శ్రేయస్ అభినందనలు తెలియజేశాడు. 

జపాన్ ఆటతీరు అద్భుతం: 

ప్రపంచ నంబర్ 1 జట్టుకు చివరి బంతి వరకు గట్టి పోటీ ఇచ్చిన జపాన్ ఆటగాళ్ల పట్టుదలను భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా కొనియాడాడు. ఇది కేవలం 5 ఓవర్ల మ్యాచ్ మాత్రమే అయినప్పటికీ, ఇక్కడి వాతావరణాన్ని అనుభవించడం, జపాన్, భారత ప్లేయర్స్ ప్రదర్శనను చూడటం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందన్నాడు. మొత్తంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన ఉత్కంఠ పోరు.. నిజం చెప్పాలంటే జపాన్ క్రికెట్ జట్టు ఆడిన తీరు, వారిలోని ఉత్సాహం నిజంగా మైండ్ బ్లాకింగ్.. అనుభవం లేకపోవడంతో జపాన్ విజయం సాధించలేకపోయినా, భారత్ వంటి దిగ్గజ జట్టును ఒత్తిడిలోకి నెట్టడం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుకు శుభపరిణామమని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.