అందరికీ ఒకే విధానంతో విద్యార్థులకు నష్టం కలుగుతుందని IIT ఢిల్లీ మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధానంలో ఇంటెన్సివ్ కోచింగ్ నుంచి విద్యార్థులకు సవాల్ గా మారుతోందన్నారు. JEEలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా కొత్త తరహా ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశంలోని IITల్లో BTech కోర్సులను ప్రస్తుత నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న అందరికి ఒకే విద్యావిధానం విద్యార్థుల సామర్థ్యాలు, విద్యా నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. JEE Advanced ద్వారా IITల్లో చేరే విద్యార్థుల ర్యాంకులు, విద్యా నేపథ్యం, నేర్చుకునే వేగం, భాషా సామర్థ్యంలో భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయన్నారు. అలాంటప్పుడు ప్రతి విద్యార్థి ఒకే వేగంతో నేర్చుకోవాలని ఆశించడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఇంటెన్సివ్ కోచింగ్ నుంచి స్వతంత్రంగా ఆలోచించి చదువుకునే విధానానికి మారడం కొంతమంది విద్యార్థులకు సవాలుగా మారుతోందని అన్నారు.
ఇంటెన్సివ్ కోచింగ్ నుంచి స్వతంత్రంగా ఆలోచించి చదువుకునే విధానానికి మారడం కొంతమంది విద్యార్థులకు సవాలుగా మారుతోందని అన్నారు. అడ్మిషన్ కేటగిరీతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు.
రావు ప్రతిపాదించిన ఐదేళ్ల BTech విధానంలో..అవసరమైన క్రెడిట్లు పూర్తి చేసిన విద్యార్థులు నాలుగేళ్లలో లేదా అవసరమైతే మూడున్నరేళ్లలో కూడా కోర్సు పూర్తి చేయవచ్చు. అదనపు సమయం అవసరమైన విద్యార్థులు ఐదేళ్లలో కోర్సు పూర్తి చేస్తూ రికార్డెడ్ లెక్చర్లు, ఆన్‌లైన్ మెటీరియల్, భాషా సహాయం వంటి అదనపు అకడమిక్ సపోర్ట్ పొందే అవకాశం ఉంటుంది.
ఐదేళ్ల కోర్సును అందరికీ సాధారణ విధానంగా అమలు చేస్తే అదనపు సంవత్సరం చదివే విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడి, అపహాస్యం తగ్గుతుందని అన్నారు. విద్యా ప్రమాణాలను కొనసాగిస్తూనే, వాటిని అందుకునేందుకు విద్యార్థులకు తగిన సమయం, సహకారం అందించడం IIT వ్యవస్థ బాధ్యత అని చెబుతున్నారు.
