తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది శ్రీలీల. ముఖ్యంగా తనదైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపును అందుకుంది. తాజాగా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరగుతోంది. ఈ స్పెషల్ సాంగ్‌ను రజినీకాంత్‌తోపాటు టాలీవుడ్ హీరో రామ్, రాశీఖన్నా, శ్రీలీలపై చిత్రీకరిస్తున్నారు.
అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ మాస్ నంబర్‌లో శ్రీలీల డ్యాన్స్ హైలైట్‌గా నిలవబోతున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత శ్రీలీల మరోసారి స్పెషల్ సాంగ్‌తో సందడి చేయబోతుండటంతో ఈ పాటపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రజినీకాంత్‌తో శ్రీలీల కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అశ్వత్ మారుముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పొంగల్ బరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
