వీళ్లిద్దరిలో ఎవరు ఆనందంగా ఉంటారు : 100 రూపాయలు దొరికిన బిచ్చగాడు.. 20 వేల కోట్ల లాభం వచ్చిన వ్యాపారి..?

వీళ్లిద్దరిలో ఎవరు ఆనందంగా ఉంటారు : 100 రూపాయలు దొరికిన బిచ్చగాడు.. 20 వేల కోట్ల లాభం వచ్చిన వ్యాపారి..?

డబ్బు మాత్రమే ఆనందం ఇస్తుంది.. డబ్బు ఉంటే ఏదైనా కొనాచ్చు.. ఏమైనా చేయొచ్చు.. ఆనందం మాత్రం రాదు అనేది నిజమేనా.. డబ్బు ఇచ్చే ఆనందం.. ఆనందమే కాదు అని కొందరు అంటే.. డబ్బు మాత్రమే ఆనందం, ఆత్మవిశ్వాసం ఇస్తుంది అనేది మరికొందరి వాదన.. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. నటుడు మాధవన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆన్ లైన్ లో దుమారం రేపుతున్నాయి. డబ్బు, ఆనందంపై చేసిన కామెంట్స్ పూర్తి వివరాలు ఇలా.. 

ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటారు?

రోడ్డుపై అడుక్కునే బిచ్చగాడికి.. ఊహించని విధంగా రోడ్డుపై 100 రూపాయలు దొరికాయి.. అదే సమయంలో 30 వేల కోట్ల రూపాయల లాభం వస్తుందని ఊహించుకున్న ఓ వ్యాపారవేత్తకు 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే లాభం వచ్చింది.. వీళ్లిద్దరిలో.. ఆ రాత్రి ఎవరు ఎక్కువ సంతోషంగా ఉన్నారు.. ఎవరు ఎక్కువ ప్రశాంతంగా.. హాయిగా నిద్రపోయారు.. మీరు ఏం అనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. 

సంతోషం, ఆనందం అనేవి రవారి వారి ఆలోచనా తీరు, వారి లక్ష్యం.. పని చేసే విధానం ఆధారంగా ఉంటుందని.. అందర్నీ ఒకేలా చూడకూడదు అనేది నటుడు మాధవన్ చెప్పుకొస్తున్నారు. డబ్బు అనేది ప్రాథమిక అవసరం మాత్రమే అని.. డబ్బు మాత్రమే సంతోషం ఇస్తుంది అంటే.. ఎంత డబ్బు సరిపోతుంది అని ప్రశ్నించారు మాధవన్. 

ఆయా కుటుంబాల్లోని ఆర్థిక, సామాజిక పరిస్థితులు, వారు పెరిగే ప్రాంతాలు, తల్లిదండ్రుల పెంపకం, వారి చుట్టూ ఉన్న సామాజిక కోణం ఆధారంగానే వారి ఆర్థిక ఆకాంక్షలు ముడిపడి ఉంటాయని తన వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు మాధవన్. డబ్బు ఉంటే విలాసవంతమైన జీవితం గడపొచ్చని.. సంతోషాన్ని కొలవలేం అని వివరించారాయన. 

మీ దగ్గర డబ్బు పెరిగే కొద్దీ ఆనందం అదే స్థాయిలో.. డబ్బుకు తగ్గట్టు ఆనందం పెరుగుతుందా అని ప్రశ్నించిన మాధవన్. డబ్బు మాత్రమే ఆనందం ఇస్తుందని భావించే వాళ్లు.. ఆ డబ్బు సంపాదించిన తర్వాత.. ఆనందం అదే స్థాయిలో పెరిగిందా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అసలు విషయం తెలుస్తుందన్నారు. డబ్బుతోనే ఆనందం అనేది రాదని.. మనం పెరిగిన వాతావరణం, పరిస్థితుల ఆధారంగా ఉంటుందని వివరించారు మాధవన్. 

ALSO READ : జనాల వింత వైనం: హీరోయిన్‌కు బలవంతంగా లిప్‌కిస్‌..

ఇటీవల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే.. నటుడు మాధవన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. నిత్యం ప్రధాని మోదీని, భారతదేశాన్ని పొగుడున్న మాధవన్.. ఇండియా కాదని దుబాయ్ వెళ్లి ఎందుకు సెటిల్ అయ్యారు.. మోదీ పాలన అంత బాగుంటే ఇండియాలోనే ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. భారత్ కాదని దుబాయ్ వెళ్లి సెటిల్ అయిన మాధవన్.. ఇండియాలో పరిస్థితులు, పాలనపై మాట్లాడటం విడ్డూరం అంటూ కామెంట్స్ చేశారు రాజ్ థాక్రే.. 

రాజ్ థాక్రే కామెంట్స్ చేసిన వారం రోజులకు.. మాధవన్ ఈ వీడియో రిలీజ్ చేయటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. చర్చకు తావిస్తోంది. డబ్బు లేనోళ్లు డబ్బు గురించి.. డబ్బు ఉన్నోళ్లు ఆనందం గురించి మాట్లాడుకుంటున్నారు.