నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మిక్స్డ్ టాక్‌తో మొదలైనప్పటికీ, విశ్వరూపం చూపిస్తున్న మాస్ యాక్షన్ సీన్ల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 114 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌లో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సినిమాలో సికంజా మాలిక్‌గా భయంకరమైన విలనిజం పండించిన మోహన్ బాబు మాట్లాడుతూ.. నా 50 ఏళ్ల కెరీర్‌లో 500 సినిమాలు చేశాను కానీ, ఇంత క్రూరమైన క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. శ్రీకాంత్ నన్ను తెరపై ఇంత వైలెంట్‌గా, బేర్ బాడీతో చూపిస్తాడనుకుంటే అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. సెట్‌లో నన్ను మోహన్ బాబులా కాకుండా సికంజా మాలిక్‌లానే చూశాడు. ఒక సీన్ కోసం నా చేత 10 టేకులు తీయించిన ఏకైక దర్శకుడు శ్రీకాంత్. గతంలో మా గురువు దాసరి గారు మాత్రమే నాతో అలా చేయించేవారు.
ప్రజాస్వామ్యంలో మనసులోని ఆవేదనను, సమాజంలోని అక్రమాలను బహిరంగంగా మాట్లాడలేకపోతున్నా అని మోహన్ బాబు అన్నారు. నా విద్యాసంస్థల్లో చదివే 20 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసమే కొన్ని విషయాల్లో సైలెంట్‌గా ఉంటున్నాను. నాని నటన, పడిన కష్టం చూసి గర్వపడుతున్నానుఅంటూ కుండబద్దలు కొట్టారు.
అనంతరం హీరో నాని మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏ సినిమాకైనా పొద్దున పాజిటివ్ టాక్ వచ్చి సాయంత్రానికి మిక్స్డ్ గా మారుతోంది. కానీ 'ది ప్యారడైజ్' విషయంలో అంతా రివర్స్ అయింది. ప్రతి షోకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ రచ్చ లేపుతోంది. ఈ సినిమాకు రియల్ హీరో మోహన్ బాబు గారే. అనిరుధ్ అందించిన 'ఆయా షేర్' సాంగ్ మరో పదేళ్ల పాటు మార్మోగుతూనే ఉంటుంది. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాం అని సంతోషం వ్యక్తం చేశారు.
►ALSO READ | NTR : జక్కన్న కాంపౌండ్ కోసం తారక్ గ్రాండ్ ఎంట్రీ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్!
ఈ సక్సెస్ మీట్‌లో ప్రియదర్శి పోషించిన 'శంకరన్న'(కేసీఆర్ ప్రేరేపిత పాత్ర) క్యారెక్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. AI టెక్నాలజీ ద్వారా ప్రియదర్శిని KCR లుక్‌లో డిజైన్ చేసి శ్రీకాంత్ ఓదెలకు చూపించగా, ఆ తర్వాత అబిడ్స్‌లో ప్రత్యేకంగా దుస్తులు, చెప్పులు కొనుగోలు చేసి, ప్రోస్తటిక్ మేకప్‌తో ఆ పాత్రకు ప్రాణం పోసినట్లు వెల్లడించారు.
అటు ‘కొబ్బరిమట్ట’ తర్వాత సరైన హిట్ లేక బాధపడ్డ సంపూర్ణేష్ బాబు, ఈ చిత్రంలో ‘బిర్యానీ’ పాత్రతో తన ఫోన్ మళ్లీ రీసౌండ్ ఇస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. కయాదు లోహర్ కథానాయికగా, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ వండర్ మూవీ, థియేటర్లలో నాని ఫ్యాన్స్‌కు అల్టిమేట్ ప్యారడైజ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది..
