డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. 'కల్కి 2' సెట్స్‌పై ప్రభాస్, కమల్, బిగ్‌బీ పోరుకు టైమ్ ఫిక్స్!

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. 'కల్కి 2' సెట్స్‌పై ప్రభాస్, కమల్, బిగ్‌బీ పోరుకు టైమ్ ఫిక్స్!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రబాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలిసిందే.  ఇప్పుడు ఈ వండర్ మూవీకి  సీక్వెల్‌గా రాబోతున్న 'కల్కి 2' బాక్సాఫీస్ సునామీ సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ భారీ ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహించని క్రేజీ వార్త అందించారు.

ఇప్పటికే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పై కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకుంది చిత్ర బృందం.  ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. డార్లింగ్ ప్రభాస్ డేట్స్ ఖరారవ్వడంతో, అక్టోబర్ మూడో వారం నుంచి ఊహించని రీతిలో భారీ షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు నాగ్ అశ్విన్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

విశ్వనటుడు కమల్ హాసన్ (యాస్కిన్), అమితాబ్ (అశ్వత్థామ), ప్రభాస్ (భైరవ)ల మధ్య రాబోయే విశ్వరూప ఘట్టాలు ఈ సీక్వెల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నాగ్ అశ్విన్ విజన్ ప్రకారం 2027 మిడ్ నాటికి షూటింగ్ ముగించి, సుదీర్ఘమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులను ప్రారంభించనున్నారు. భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ బాహుబలి రికార్డుల రారాజు 2028లో థియేటర్లలో తుఫాన్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

►ALSO READ | ‘ప్యారడైజ్’ చూసేందుకు థియేటర్కు కేటీఆర్.. రీజన్ ఇదేగా !

మరోవైపు ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఓ పవర్ ఫుల్ రోల్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ఫిల్మ్ నగర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. అక్టోబర్‌లో దీనిపై వైజయంతీ మూవీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. 

నేషనల్ అవార్డుల పంట పండించిన 'కల్కి' మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుల దుమ్ముదులిపింది. దానికి పది రెట్ల గ్రాండియర్, ఎమోషన్, అత్యున్నత సాంకేతికతతో సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు నాగ్ అశ్విన్. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.