ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరుగురు స్కూల్ విద్యార్థులు ఒకే బైక్‌పై అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో స్థానికులు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు అని తెలిసి కూడా, విద్యార్థులు చేసిన ఈ స్టంట్ అందరినీ ఆందోళనకు గురిచేసింది.
వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో దృశ్యాలు చూస్తే... ఒకే ద్విచక్ర వాహనంపై ఒక విద్యార్థి బైక్ నడుపుతుండగా, అతని వెనుక మరో నలుగురు ఇరుక్కుని మరీ కూర్చున్నారు. అంతటితో ఆగకుండా, వెనుక కూర్చున్న ఒక బాలుడి భుజాలపై ఆరో విద్యార్థి ఎక్కి కూర్చున్నాడు.
కనీస బ్యాలెన్స్ లేని ఆ బైక్‌ను రద్దీగా ఉండే రోడ్డు పై నడుపుతూ, వాళ్ళ ప్రాణాలను మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టారు.
పోలీసుల రూ.25,000 ఫైన్
ఈ ప్రమాదకర రైడ్ సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో మీరట్ ట్రాఫిక్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి ఆ బైక్‌పై రూ. 25,000 భారీ జరిమానా (చలానా) విధించారు.
అక్కడితో ఆగకుండా.. ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సీజ్ చేసే ప్రక్రియ వేగవంతం చేశామని మీరట్ పోలీస్ అధికారి రాజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. మైనర్లు బైకులు నడపడం, అందులో ఇలాంటి స్టంట్లు చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
"పిల్లలు ఇలా ప్రమాదకరంగా బైక్ నడపడం తీవ్రమైన నేరం. ఈ విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పిల్లలకే కాకుండా, వారి తల్లిదండ్రులపై కూడా చట్టరీత్యా బాధ్యత మోపి కఠిన చర్యలు తీసుకుంటున్నాం."
అని SP రాజేష్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు.
ALSO READ : ఏలియన్స్ పంపిన సందేశాలా?
సోషల్ మీడియా లైక్స్ కోసం
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ లేదా గుర్తింపు కోసం మైనర్లు ఇలాంటి రీల్స్, ప్రమాదకర స్టంట్లు చేయడం పెరిగిపోతోంది. ఒకే బైక్‌పై పరిమితికి మించి ప్రయాణించడం వల్ల వాహన కంట్రోల్ కోల్పోయి ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలకు బైకులు ఇచ్చే ముందు తల్లిదండ్రులు వారి భద్రతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
गिन कर बताइए एक बाइक पर कितने लोग सवार है वीडियो मेरठ की है सोशल मीडिया पर वायरल है। और बाइक पर सवार सभी छात्र है लेकिन इस लापरवाही का जिम्मेदार जितने ये छात्र है उतने ही जिम्मेदार इनके पैरेंट्स भी है #meerut https://t.co/KGgZxA5t4v
— Sudhir Chauhan (@sudhirstar) September 24, 2026
