తిరువనంతపురంలో రోహిత్ ఫ్యాన్స్ రచ్చ.. గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట 50 అడుగుల కటౌట్!

తిరువనంతపురంలో రోహిత్ ఫ్యాన్స్ రచ్చ.. గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట 50 అడుగుల కటౌట్!

Rohit Sharma 50 Feet Cut Out: భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్‌కు వేదికైన కేరళలోని తిరువనంతపురంలో క్రికెట్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం పరిసరాలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల కోలాహలంతో పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రేపు (సెప్టెంబర్ 27, ఆదివారం) జరగనున్న ఈ హైవోల్టేజ్ పోరు కోసం కేరళ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఓపెనర్, రోహిత్ శర్మపై తమ అభిమానాన్ని చాటుకుంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రోహిత్ శర్మ 50 అడుగుల కటౌట్: 

ఇండియా వర్సెస్ విండీస్ మ్యాచ్ నేపథ్యంలో ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం బయట ఏకంగా 50 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అయితే కేరళ గడ్డపై రోహిత్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో ఈ కటౌట్ తో మరోసారి నిరూపించింది. తిరువనంతపురానికి తరలివస్తున్న క్రికెట్ లవర్స్, అభిమానులు ఈ భారీ కటౌట్ ఎదుట ఆగి సెల్ఫీలు దిగుతూ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. 

►ALSO READ | రేపటి భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి: రోహిత్, కోహ్లీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

పండగ వాతావరణంలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియం: 

కేరళలో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా అభిమానులు భారీ బ్యానర్లు, కటౌట్లతో తమ అభిమాత్వాన్ని చాటుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు తిరిగి వన్డే జట్టులోకి అడుగు పెడుతుండటంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. స్టేడియం బయట కనిపిస్తున్న ఈ కోలాహలం, అభిమానుల కేరింతలు మ్యాచ్‌లోని ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నాయి. ఇరు జట్ల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధంకావడంతో తిరువనంతపురం క్రికెట్ మాయాజాలంలో మునిగిపోయింది.