అన్షు, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ ‘కొన్ని నెలల ముందు బెక్కెం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసింది. టీమ్ ఎంతో ప్యాషనేట్‌గా తీశారు.
తప్పకుండా అందరి టైమ్‌కు, డబ్బుకు విలువనిచ్చే సినిమా ఇదని నమ్ముతున్నా’ అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బెక్కెం వేణుగోపాల్ తప్పకుండా అందర్నీ సంతృప్తిపరిచే చిత్రమిది అని అన్నారు. హీరో అన్షు మాట్లాడుతూ ‘ఈ సినిమా చూస్తుంటే అందరికి తమ సొంతూరికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇందులో ఎమోషన్, ఫన్‌తోపాటు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించడం హ్యాపీగా ఉందని వాసవి గణేషన్ చెప్పింది. దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ‘ఈ కథ, కథనం అంతా సమాజంలో చూసిందే రాసుకున్నా. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా ఉంటుంది. కమర్షియల్ అంశాలతో పాటు సందేశం కూడా ఉంది’ అని చెప్పాడు.
