వారఫలాలు ( అక్టోబర్4–10 ): గ్రహాల సంచారంలో కీలక మార్పులు..12 రాశుల వారి జాతకం ఇదే..!

వారఫలాలు ( అక్టోబర్4–10 ): గ్రహాల సంచారంలో కీలక మార్పులు..12 రాశుల వారి జాతకం ఇదే..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ వారంలో శుక్రుడు తులా రాశిలో వక్రగతిలో సంచారం చేయనున్నాడు.  కర్కాటక రాశిలో చంద్రుడు .. గురుడు కలిసి సంచరించడంతో గజకేసరి యోగం ఏర్పడుతుంది.  ఈ వారం  చివరి వరకు మహాలయ పక్షాలు కొనసాగుతాయి.  గ్రహాల సంచారం ఆధారంగా ఈ వారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందా..!

మేష రాశి:  ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని సునాయాశంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు .. కార్యాలయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. పనిలో  సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వలన మీ లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతుతన్నారు.పెళ్లి కోసం ఎదురు చూస్తున్నవారు గుడ్​ న్యూస్​ వింటారు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభ రాశి : ఈ వారం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా గడుస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయపరంగా కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు  గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనిలో మీ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని నిరూపించుకునే కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు

మిథునరాశి:  ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి.  ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు . ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిదని పండితులు అంటున్నారు. ఉద్యోగులకు ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ వారం తలపెట్టిన పనులకు పూర్తి చేసుకోగలుగుతారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు వస్తాయి.  కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు మాత్రం ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యవిషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పండితులు చెబుతున్నారు. 

 సింహరాశి:ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆస్తి సంబంధ విషయాలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి.. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనికి ప్రశంసలు పొందుతారు. మీ రంగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.  ఆత్మవిశ్వాసంతో అత్యంత కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు

కన్యారాశి : ఈ రాశి వారు ఈ వారం కొంచెం హడావిడిగా గడుపుతారు.  అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ఆవేశంతో.. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.  అనవసరమైన ఖర్చులు ఆర్థిక పరిస్థితిపై కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.   ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయాలి. వారం మధ్యలో చిన్న పనులకు కూడా కష్టపడాల్సి ఉంటుంది.  ఆరోగ్యంవిషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఖర్చులను నియంత్రించుకోవాలని పండితులు చెబుతున్నారు. 

తులారాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనులను కష్టంతోనే పూర్తి చేసుకోగలుగుతారు.  వ్యాపారపరమైన శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్య వర్తులను ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

 వృశ్చిక రాశి : ఈవారం ఈ రాశి వారు కొత ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో  భారీగా లాభపడతారు. అనూహ్యమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులు  చాలా సంతోషంగా గడుపుతారు.  అధికారుల మద్దతు లభించడంతో కీలకమైన బాధ్యతలు చేతికి వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి

ధనుస్సు రాశి:ఈవారం ఈ రాశి వారు  చాలా ప్రశాంతంగా ఉంటారు.  ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త వెంచర్లు ప్రారంభిస్తారు.  మంచి ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉన్నతాధికారులు సహకారం ఉంటుంది.  కార్యాలయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.  ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  

మకర రాశి: ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ప్రతి పనిని ధైర్యంగా పూర్తి చేస్తారు.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు ప్రమోహషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  కొత్త ప్రాజెక్ట్​లు చేపడతారు.  వ్యాపారస్తులకు ఊహించని లాభాలు ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. 

 కుంభ రాశి:ఈ వారం ఈ రాశివారికి  అదృష్టం కలిసివచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరే అవకాశం ఉంది.  గతంలో ఆగిపోయిన పనుల్లో ఈ వారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులు ప్రమోషన్​ పొందేందుకు రూట్​ క్లియర్​ అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఈ వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది.  ప్రేమ... పెళ్లి వ్యవహారాలు అనుకూలంగాసాగిపోతాయి. 

మీన రాశి: ఈ రాశి వారికి ఈ వారం  సాధారణంగా ఉంటుంది . కొన్ని వ్యక్తిగత సమస్యలు ఆందోళన కలిగించే అవకాశం ఉంది.  వృత్తి, వ్యాపార విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. అనవసర ఖర్చుల్ని చాలావరకు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం