నిజాం రజాకార్లను తరిమి కొట్టిన మనం బీసీల హక్కుల కోసం పోరాడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

నిజాం రజాకార్లను తరిమి కొట్టిన మనం బీసీల హక్కుల కోసం పోరాడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్య ఆధ్వర్యంలో ఓబీసీ కుఅలగణనపై భారీ బహిరంగ సభ జరిగింది. ఆదివారం ( అక్టోబర్ 4 ) జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిజాం రజాకార్లను తరిమి కొట్టిన మనం బీసీల హక్కుల కోసం పోరాడాలని అన్నారు.

రాష్ట్రంలో కుల గణన చేసిన ప్రభుత్వం మనది అని.. కుల గణన లో OBC లేదని అన్నారు. మేం ఎవరికి వ్యతిరేకం కాదని..అందరికి సమాన అవకాశాలు వచ్చినప్పుడే అభివ్రుద్ది జరుగుతుందని అన్నారు. గ్రామ స్థాయి నుండి OBC ల గురించి మీటింగులు పెట్టాలని పిలుపునిచ్చారు. 

నిజాం రజాకార్లను తరిమి కొట్టిన మనం మన హక్కుల కోసం పోరాడాలని.. మాసమంతా బంగారం ఉన్న మిసమంత అధికారం కావాలని అన్నారు పొన్నం ప్రభాకర్. అందరికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని.. బీసీ హక్కుల సాధన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకెళ్లాలని అన్నారు పొన్నం ప్రభాకర్.