షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్య ఆధ్వర్యంలో ఓబీసీ కుఅలగణనపై భారీ బహిరంగ సభ జరిగింది. ఆదివారం ( అక్టోబర్ 4 ) జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ నాయకత్వంలో గట్టిగా మాట్లాడుతున్నామని.. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణకు కాబోయేది బీసీ సీఎం అని అన్నారు. మాకు రావాల్సిన వాటా తీసుకుంటాం, అవసరమైతే లాక్కుంటామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని వర్గాల పార్టీ అని.. కాంగ్రెస్ పార్టీ లో ఎవరికి దక్కాలో వారికి దక్కుతుందని అన్నారు మహేష్ కుమార్. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలగా చూస్తున్నారని అన్నారు. బీజేపీ తూతూ మంత్రంగా సర్వే చేస్తున్నారని... మోదీ కి కనువిప్పు కలగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పిలుపు కేంద్రానికి తెలియాలని అన్నారు.
55 శాతం పైగా బీసీలను సర్పంచ్ లను చేశామని.. మాట ఇచ్చి వెనుకకి పోయే పార్టీ కాదని అన్నారు మహేష్ కుమార్ గాడ్. మంత్రి వర్గంలో ,ఎమ్మెల్సీలలో కార్పొరేషన్ లలో బీసీల సంఖ్య పెంచుతామని అన్నారు. దేశ వ్యాప్తంగా సర్వే రానున్న రోజుల్లో మేమే చేసుకుంటామని.. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని.. అన్ని వర్గాల రావలసిన వాట రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇస్తామని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.
►ALSO READ | నిజాం రజాకార్లను తరిమి కొట్టిన మనం బీసీల హక్కుల కోసం పోరాడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
కొద్ది రోజులు కులాలు పక్కన పెట్టి బీసీలు అంతా ఏకమవ్వాలని... అప్పుడు మన ఇంటికి మన హక్కులు వస్తాయని అన్నారు. మన సమస్య వచ్చినప్పుడు ఏకం అవ్వాలని.. ఇది మన సమస్య భవిష్యత్తు తరాల వారికోసం పోరాడాలని అన్నారు.
