ఏపీలో లక్ష కోట్ల భారీ పెట్టుబడుల దిశగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టనున్న మెగా ప్రాజెక్టుకు కీలక అనుమతులు లభించాయి. రూ.1.45 లక్షల భారీ వ్యయంతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారబోతుందని అంటున్నారు.
రామాయపట్నం పోర్టు సమీపంలో సుమారు 5వేల 200 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఈ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వెలది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తీర ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పెట్రోల్ డీజిల్, ఏటీఎఫ్ నాఫ్తా వంటి ఇంధనాలతో పాటు వివిధ రకాల పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు చేననున్నారు. అంతే కాకుండా పారిశ్రామికంగానే కాకుండా పర్యావరణ సమతుల్యత కోసం బీపీసీఎల్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో 30శాతం మేర గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయాలని.. కాలుష్య నివారణకు అత్యాధునిక సాకేతికతను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
