ఇటీవల కాలంలో భర్తలను వేధిస్తున్న భార్యలు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తోందని అంటున్నారు నేటి యువత. ఇలాంటిదే మరో ఘటన జరిగింది. పాపం.. 85 ఏళ్ళ వయసులో కూడా ఈ వృద్దుడికి భార్య వేధింపులు తప్పలేదు. భార్య వేధిస్తోందని ఓ వృద్ధుడు జగిత్యాల జిల్లా వెల్గటూరులో పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆదివారం ( అక్టోబర్ 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
హైదరాబాద్ కు చెందిన 85 ఏళ్ళ విజయ శ్రీనివాస్ దత్తాత్రేయ వెల్గటూరులోని పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి చేశాడు. ఇది గమనించిన స్థానికులు జాలర్లకు సమాచారం ఇవ్వడంతో వృద్ధుడిని కాపాడారు జాలర్లు. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపాడు వృద్ధుడు.
అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. విజయ శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించామని తెలిపారు పోలీసులు. బందువులకు సమాచారం అందించి అతడిని ఇంటికి పంపిస్తామని తెలిపారు పోలీసులు.కృష్ణ రామ అనుకుంటూ కాలం గడపాల్సిన 85ఏళ్ళ వయసులో ఏంటో ఈయనకు ఈ పరిస్థితి అంటూ జాలి పడుతున్నారు స్థానికులు.
