టాక్సేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం .. UPI ఛార్జీలపై కీలక ప్రకటన

టాక్సేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం .. UPI ఛార్జీలపై కీలక ప్రకటన

టాక్సేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. యూపీఐ ఛార్జీలపై దేశ వ్యాప్తంగా సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. 2026 ఆగస్టు 10న పన్నుల  బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా యూపీఐ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. 

యూపీఐ పేమెంట్స్ కు ఎలాంటి ట్యాక్స్ ఉండదని కేంద్రం తెలిపింది. బిల్లు పాసైన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. యూపీఐ ట్రాన్జాక్షన్స్ పై ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించారు. దీంతో కోట్లాది మందికి ఉపశమనం లభించినట్లయింది. 

గత వారం లోక్ సభలో పాస్ అయిన బిల్లుకు.. ఇవాళ రాజ్యసభ మూజువాని ఓటుతో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేమెంట్స్, సెటిల్మెంట్స్ సిస్టమ్స్ కు సంబంధించి  చట్టంలోని సెక్షన్ 10Aకు సవరణ కేవలం ఒక   నిబంధన మాత్రమేనని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ దశలో వినియోగదారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని అన్నారు. 

►ALSO READ | పన్నెండేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పోరేట్ రుణాలు మాఫీ: ప్రభుత్వ ప్రకటన

పార్లమెంట్ ఆమోదం తర్వాత, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)   UPI ,  సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ MDR ఛార్జీని ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు   మంత్రి తెలిపారు. ఏ MDR ఫ్రేమ్‌వర్క్ కూడా ఖరారు కాలేదని ఆమె చెప్పారు.