ఆటోలు, ఓలా, ఊబర్ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. వీవీ స్టాచ్యూ, ఖైరతాబాద్, నిరంకారి మధ్య మెయిన్ రోడ్డుపై ప్రయాణికులను ఎక్కించడం, దించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఆటోలు, క్యాబ్‌లు ప్రయాణికులను దించడానికి ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని మాత్రమే ఉపయోగించాలి.
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్ పరిసరాల్లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు. వీవీ స్టాచ్యూ వైపు నుంచి ఫ్లై ఓవర్మీదుగా ..రాజీవ్ గాంధీ విగ్రహం.. మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. పాత పీఎస్ సైఫాబాద్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేశ్వైపు వచ్చే వెహికల్స్‌ను ఇక్బాల్ మినార్ వైపు టర్న్ చేస్తారు.
ఇక ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లేన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు తరలిస్తారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు పంపిస్తారు.
