జ్యోతిష్యం: గురుబలం ఎఫెక్ట్.. కర్కాటకరాశిలో వజ్రయోగం.. నాలుగు రాశుల వారికి రాజయోగం.. మిగతా రాశుల వారి జాతకం ఇదే..!

జ్యోతిష్యం:  గురుబలం ఎఫెక్ట్.. కర్కాటకరాశిలో వజ్రయోగం.. నాలుగు రాశుల వారికి రాజయోగం.. మిగతా రాశుల వారి జాతకం ఇదే..!

దేవతలకు గురువైన గురుడు  సంపదను, శ్రేయస్సును, వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు. జీవితాన్ని సరైన దారిలో నడిపించి మంచి స్థాయికి చేరుకునేలా చూసుకుంటాడు. అయితే గురుడు ఆగస్టు 10 వ తేది సాయంత్రం 5.32 గంటలకు  కర్కాటక రాశిలోనే ఉదయించబోతున్నాడు..  ఆ సమయంలో వజ్రయోగం ఏర్పడుతుంది.    ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ   నాలుగు రాశుల ( కర్కాటక,  కన్య, తుల, ధనస్సు) వారికి బాగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. .

మేషరాశి: ఈ రాశి వారికి .. కర్కాటక రాశి లో గురుడు ఉదయించడం వలన  కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కష్టపడతారు కాని శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు.  సహోద్యోగులు.. తోటి వారి పట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.  గతంలో మీనుంచి సాయం పొందిన వారు.. ఇప్పుడు ముఖం చాటేస్తారు.  ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.  ఖర్చులు అధికమవుతాయి.  అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  

వృషభరాశి :  కర్కాటకరాశిలో వజ్రయోగం వలన  ఈ రాశి వారికి అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి.  పెండింగ్​ పనులు పూర్తికావడంతో సంతోషంగా గడుపుతాయి.  ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలుంటాయి.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్​ వచ్చే అవకాశంతో పాటు.. కొద్దిగా వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాహనం డ్రైవింగ్​ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

మిథునరాశి: కర్కాటక రాశిలో గురుడు ఉదయించడం వలన   ఈ రాశి  వారికి  వైవాహిక జీవితంలో  సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.   పనుల్లో ఆటంకంకలిగే అవకాశం ఉందని  పండితులు చెబుతున్నారు.  ఆర్థిక పరంగా కొద్దిపాటి చిక్కులు ఉన్నా.. సకాలంలో చేతికి డబ్బు అందుతుంది.  డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి.  ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలుగుతాయి.  జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 

కర్కాటకరాశి : గురు గ్రహం ఇదే రాశిలోనే ఉదయయించడం  వజ్రయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం వలన ఈ రాశి వారికి భారీ లాభాలు కలుగుతాయి.. చాలాకాలంగా ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తి చేస్తారు.  ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ తో పాటు పెరిగే  అవకాశం ఉంది.   కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి . కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంది. మొత్తమ్మీద సంతోషంగా ఉంటారు.

సింహరాశి:  కర్కాటకరాశిలో  గురుడు దిశ మారడం వలన ఈ రాశి వారికి  అన్ని విధాలా కలసి వస్తుంది.  కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ బేధాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.  డబ్బులావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.  వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభం వస్తుంది.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​వింటారు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  ఉద్యోగస్తుల విషయంలో  స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్​లు  చేపట్టడం .. కొద్దిపాటి మేరకు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడుపుతారు. 

కన్యారాశి:   ఈ రాశి వారికి గురుడు బలం అనుకూలంగా ఉండం వలన ఆగస్టు 10 తర్వాత మీకు ఊహించని ప్రయోజనాలు అందుతాయి.  ఆదాయం బాగా పెరుగుతుంది.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బు పరంగా బలంగా మారుతారు ... ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పని పూర్త్యే అవకాశం ఉంది.  కెరీర్​ విషయంలో సానుకూల మార్పులు జరుగుతాయి.  వ్యాపారస్తులకు అన్ని విధాలా కలసి వస్తుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చేతికొచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

 తులారాశి: గురు గ్రహం కర్కాటక రాశిలో ఉదయించడం వల్ల ఈ రాశి వారికి భారీగా కలిసివస్తుంది.  వృత్తి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు  కష్టానికి తగ్గ గుర్తించి దక్కుతుంది.  ఉద్యోగం మారాలనుకునేవారికి  ... కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు తెచ్చే ఒప్పందాలు జరుగుతాయి.  ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి.  అధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి.  కార్యాలయంలో మీరు చక్రం తిప్పే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అధిక లాభాలుంటాయి.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి : కర్కాటక రాశిలో  వజ్రయోగం వలన ఈ రాశి వారు చేపట్టే కొత్త పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.  పనిభారం అధికమవుతుంది.  ఆర్థిక విషయాల్లో మిత్రులు మోసగించే అవకాశం ఉంది.  రావలసిన డబ్బు కొద్దిగా మాత్రమే చేతికందుతుంది.  వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఇతరులతో మాట్లడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి.  ప్రతి పని కూడా కష్టపడితే గాని  పూర్తి కాదు.  ఆస్తివివాదాలు.. కోర్టు కేసుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 

 ధనస్సురాశి : కర్కాటకరాశిలో గురుడు ఉదయించడం వలన వజ్రయోగం ఏర్పడుతుంది.  దీని వలన ఈ రాశి వారికి  ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయి.  పని, ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గి... కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది.గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ప్రతిఫలం పొందుతారు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు .. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.

మకరరాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.  కొత్త  వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆర్థిక సమస్యలు పెరగడంతో  అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  బంధువులతోనూ.. స్నేహితులతోనూ చిన్న చిన్న విషయాలకూ మనస్పర్దలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.. వ్యాపారస్తులు ఏ మాత్రం కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు.  ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది. 

కుంభరాశి:   గురుడు సంచలనంలో దిశ మారడం వలన ఈ రాశి వారి కెరీర్​ లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.  సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు పెరుగుతాయి.  ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని విషయంలో శుభవార్త వింటారు.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.  అయితే ఒక్కోసారి ఆందోళనకర వాతావరణం ఉంటుంది.  అధైర్య పడకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి.. అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులకు అంచనాకు మించి లాభాలొస్తాయి. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మీనరాశి:  ఈ రాశి వారికి ... కర్కాటక రాశిలో  గురుడు ఉదయించడం వలన చాలా లాభదాయంగా ఉంటుంది. ఉల్లాసంగా.. ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు.  ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారస్తులకు లాభాలతో పాటు... బిజినెస్​ ను విస్తరించే అవకాశం ఉంటుంది.  కొత్త పనులు మొదలు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాశంగా పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.