రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఫ్యామిలీ డ్రామాతో కూడిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ ‘మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. సినిమా నచ్చకపోతే మా బ్యానర్ ఇన్‌స్టా పేజీకి టికెట్ పెట్టండి డబ్బులు రిటర్న్ ఇస్తాం.
ఈవీవీ, జంధ్యాల, అనిల్ రావిపూడి సినిమాలా మా మూవీలో ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉంటారు. ఇందులో దాదాపు 50 మందికి పైగా నటీనటులు కనిపిస్తారు’ అని చెప్పాడు. నటులు పృథ్వీ, శ్రీనివాస్, బాల, సునీత, యోగి, రాంకీ తదితరులు పాల్గొన్నారు.
