న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకులు గత 12 ఆర్థిక సంవత్సరాలలో కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన లోన్లలో రూ.9.95 లక్షల కోట్లను తమ బుక్స్ నుంచి తొలగించాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో సోమవారం ఈ విషయాన్ని రాతపూర్వకంగా వెల్లడించారు.
2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రైటాఫ్‌లు గరిష్టంగా రూ.1.48 లక్షల కోట్లకు చేరగా, 2025 నాటికి రూ.20,485 కోట్లకు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. లార్జ్ ఇండస్ట్రీస్ ఔట్‌స్టాండింగ్ లోన్లు 2026 నాటికి రూ.69.21 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. గత 5 ఆర్థిక సంవత్సరాలలో 5.87 లక్షల డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్ వెలుగు చూశాయని, వీటిలో మొత్తం రూ.3,590.70 కోట్ల మోసాలు జరిగాయని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
