ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఆపరేటర్లు కూడా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి రావొచ్చు: కేంద్రం

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఆపరేటర్లు కూడా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి రావొచ్చు: కేంద్రం

న్యూఢిల్లీ: ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులను నిర్వహిస్తున్న అదానీ లాంటి కంపెనీలు, ఇండిగో, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఇండియా వంటి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీల వాటాలు కొనడంపై ప్రభుత్వ పరంగా ఎటువంటి  నిషేధం లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌కు తెలిపింది. అయితే, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ (పీపీపీ) ఒప్పందాల ప్రకారం కొన్ని విమానాశ్రయాల ఒప్పందాల్లో ఇటువంటి క్రాస్-ఓనర్ షిప్‌‌‌‌‌‌‌‌పై ఆంక్షలు ఉన్నాయని స్పష్టం చేసింది. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ నిర్వాహకులు ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ వ్యాపారంలోకి రాకుండా చేసే నిబంధనలను  సడలించేందుకు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను అదానీ గ్రూప్ కోరిందని, అయితే దీనిని ఇంకా పౌర విమానయాన శాఖ పరిశీలించలేదని వెల్లడించింది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రీజినల్‌‌‌‌‌‌‌‌గా విమాన ప్రయాణాలను విస్తరించేందుకు ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ రంగంలోకి అడుగుపెట్టాలని భావించిందని, ఇందుకోసమే ఒప్పందాల రూల్స్‌‌‌‌ నుంచి సడలింపు కోరిందనే రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లు  వెలువడ్డాయి.  ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచన ఏదీ లేదని సంస్థ పేర్కొంది.