ఆయిల్ ట్యాంకర్లకు యుద్ధ నౌకల ఎస్కార్ట్

ఆయిల్ ట్యాంకర్లకు యుద్ధ నౌకల ఎస్కార్ట్

న్యూఢిల్లీ: బాబ్–ఎల్–మాండెబ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం పహారాను మరింత పెంచింది. హార్మూజ్ సంక్షోభం, ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడుల ముప్పు పెరిగిన తరుణంలో, భారత్‌‌కు వస్తున్న ఆయిల్ ట్యాంకర్లకు రక్షణగా ఇండియన్ నేవీ యుద్ధనౌకలను రంగంలోకి దించింది. 

భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ త్రిశూల్’, ‘ఐఎన్ఎస్ ఆదిత్య’ యుద్ధనౌకలు సంయుక్తంగా ఈ భద్రతా ఆపరేషన్‌‌ను చేపడుతున్నాయి. బాబ్–ఎల్‌‌–మాండెబ్ గుండా ఆగస్టు 9, 10 తేదీల్లో ప్రయాణించిన ఎంటీ కంపాస్, ఎంటీ తలతా అనే రెండు భారీ చమురు ట్యాంకర్లకు ఈ యుద్ధనౌకలు రక్షణ కల్పించాయని నౌకాదళ వెస్ట్రన్‌‌ కమాండ్ ‘ఎక్స్’ లో వెల్లడించింది.