విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానం

విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానం

ఖమ్మం టౌన్, వెలుగు: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 50 గంటల పాటు ‘ఆట, పాట, మాట’లతో ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క తెలిపారు. ఖమ్మం ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆమె మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల నుంచే ప్రజా కళాకారులు ఉద్భవిస్తారన్నారు.

బహుళ ప్రజా, జానపద కళారూపాలతో ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్థలు, కళాకారులు, ప్రజా సంఘాలు, వ్యక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

50 గంటల ప్రజా కళా జాతరలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో మల్సూర్, పోతుల రమేష్, సుధాకర్, భాస్కర్, విజయ్, రాకేష్, అనిత తదితరులు పాల్గొన్నారు.