రాజగృహంలో ఒక గొప్ప సంపన్నుడికి ఒక కూతురు ఉండేది.. ఆమె ధర్మాన్ని అభిమానించేది. ఒకరోజున కుక్కుట మిత్రుడినే వేటగాడు బండి మీద లేడి మాంసం అమ్ముకుంటూ నగరంలోకి వచ్చాడు. అతడ్ని చూడగానే ఆ శ్రీమంతురాలైన అమ్మాయి మనసు పారేసుకుంది. ఆ వేటగాడ్ని ప్రేమించింది. ఇక వెనకా ముందూ ఆలోచించకుండా అతడి వెంటనే బయల్దేరింది. ఒక చిన్న పలెల్లో కాపురం పెట్టింది. ఈ దాంపత్యం ఫలితంగా ఎదుగురు కొడుకులు పుట్టారు. పిల్లలంతా పెద్దవాళ్లయ్యారు వాళ్ల పెళ్లిళ్లు కూడా అయిపోయాయి.
కుక్కుటుమిత్రుడికి, ఆయన భార్యకు వయసు మీద పడింది. దివ్యదృష్టితో వీళ్లను చూసిన బుద్ధుడు ఏదో ఒక రోజు ఆ దంపతులు వాళ్ల సంతానమూ ధర్మాన్ని తెలుసుకోగలరని అనుకున్నాడు. దాంతో బుద్ధుడు అడవిలోకి వెళ్లి వేటగాడు వలలు పన్నిన చోటుకు వెళ్లాడు. దాని పక్కనే తన పాదముద్రలు కనపడేటట్లు చేసి అక్కడికి కొంచెందూరంలో ఉన్న పొదలో కూర్చున్నాడు.
కుక్కుట మిత్రుడు వచ్చి చూడగానే ఏ జంతువుగానీ, పక్షిగానీ ఉచ్చుల్లో ఉండకపోవడం గమనించాడు. వల ఖాళీగా ఉంది.. అయితే, పక్కనే ఎవరివో కాలిగుర్తులు కనిపించాయి. దాంతో తాను రావడానికి ముందే ఎవరో ఇక్కడకు వచ్చి వలలో పడ్డ జంతువును విడిపించి ఉండాలి అని వేటగాడు భావించాడు. చుట్టూ పరిశీలించి చూడగా దగ్గరలో పొదలో కూర్చొని ఉన్న బుద్ధుడు కనిపించాడు. "ఓహో. నా వలలో చిక్కిన వాటిని ఇతడే 'విడిపించాడు' అని నిశ్చయించుకున్నాడు. ఆ పొదలో ఉన్న వ్యక్తి మీద వేటగాడికి చాలా కోపం వచ్చింది.
విల్లు చేతబట్టి
కోపంతో విల్లు చేతిలోకి తీసుకొని బాణం ఎక్కుపెట్టాడు. అయితే, అమ్ములపొది నుంచి బాణం తీయపోతుండగా అతడి చేయి కొయ్యబారి పోయింది... ఎటూ కదల్లేకపోయాడు. శిలావిగ్రహం చేయిలాగా అయిపోయింది. చాలా సేపటివరకు ఇంటికి రాకపోవడంతో అతడి పిల్లలు నెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు. ఎటు కదల్లేని స్థితిలో ఉన్న అతని తండ్రి కనపడ్డాడు. ఆ పక్కనే కొంచెం దూరంలో బుద్ధుడు కూడా కనపడ్డాడు. ఆయన తన తండ్రి శత్రువేమోనని వాళ్లకు సందేహం కలిగింది. అందరూ ఒక్కసారిగా విల్లంబులు సంధించారు. కానీ, వాళ్లు కూడా ఎక్కడివాళ్లు అక్కడ స్తంభించిపోయారు.
ఈసారి తల్లి వచ్చింది
తండ్రీ పిల్లలూ ఎంతకూ ఇంటికి చేరకపోవడంతో తల్లి వాళ్లను వెతుక్కుంటూ ఆడవిలోకి ఆమె వెంట కోడళ్లుకూడా వచ్చాడు. తన భర్త, కొడుకులూ కూడా బుద్ధుడి పై బాణాలు ఎక్కు పెట్టి ఉండటం చూసి ఆమె కోప్పడింది. 'అయ్యో, అయ్యో నా తండ్రిని చంపొద్దు. ఆ బాణాలు వేయొద్దు' అని తన భార్య మాటలు ఎప్పుడైతే విన్నాడో. అప్పుడు పొడలో ఉన్న ఆయన తన మామగారు అది వేటగాడు. భావించాడు.
►ALSO READ | జీవితం అంటే ఇదే... నిర్ణయం.. గెలుపునకు సగం బలం.. ప్రేమ ఉండదు..భ్రమలే ఎక్కువ
ఆమె పిల్లలందరూ ఆయన తమ తాతగారు అని కలవరపడ్డారు. వాళ్లలో ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయి. వాళ్ల దగ్గరకు వచ్చిన తల్లి బాణాలు అవతల పారేయండి. నా తండ్రి కాళ్లమీద పడండి' అని ఉద్వేగంతో చెప్పింది. ఆ సమయానికి వాళ్ల హృదయాలు కరిగిపోయాయని బుద్దుడు కూడా గ్రహించాడు. ఆ నాణాలు, ధనుస్సులు తీసి అవతల పడేస్తారని ఆయనకు అనిపించింది. వాళ్లు తమ చేతుల్లోని ధనస్సులు.. బాణాలు వదిలేసి ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. అప్పుడు బుద్ధుడు వాళ్లకు ధర్మాన్ని బోధించాడు. ధర్మోపదేశం విని అందరూ దర్మపరులయ్యారు.
ఆమె ఏ పాపం చేయలేదా ?
బుద్ధుడు జేతమన విహారానికి వచ్చి వేటగాడి కుటుంబ వృత్తాంతం అక్కడి భిక్షువులకు చెప్పాడు. అప్పుడు బిక్షువులు' వేటగాడి భార్యది మాత్రం దుష్కర్మ కాదా ? ఆమె ఏ పాపం చేయలేదా? జీవి హింసకు పాలుపడలేదా? ప్రోత్సహించలేదా? ఉరులూ, వలలూ, బాణాలూ. ధనస్సులూ తీసుకొని ఆమె వేటగాడి వెంట వెళ్లేది కదా అని అడిగారు. అప్పుడాయన మాట్లాడుతూ..'భిక్షువులారా! సోతపన్ను లైనవారు (సంసార చక్రానికి కట్టిపడేసి ఉంచే బంధాలలో మూడింటిని తెంచుకొని నిర్వాణాన్ని చ్చే జ్ఞాన మార్గంలో ప్రవేశించినవారే పోతాపమ్ములు) ఎవరినీ చంపరు.
ఇంకెవరినీ ప్రాణ హింసకు ప్రోత్సహించరు, అంగీకరించరు. అయితే. వేటగాడి భార్యగా అతడు చెప్పిన పనులు చేయక తప్పింది కాదు. తాను భర్త చేస్తున్న జీవహింసలో పాల్గొంటున్నట్టు ఆమెకెప్పుడూ తోచలేదు. సాయం చేస్తున్నానని భావించలేదు. పుండు లేని చేతిని విషం ఎట్లా బాధించదో... ఆమెకు పాపం పట్ల కోరిక లేనందువల్ల దుష్కర్మకు పాల్పడినట్టు కాదు' అని బుద్దుడు వాళ్లకు వివరించాడు.
