T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో కోలంబోలో రేపు ( ఫిబ్రవరి 15న) జరగనున్న భారత్– పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక సూచనలు చేశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే పెద్ద షాట్లు లేదా షాకింగ్ ప్లేయర్ అవసరం లేదు, కేవలం బేసిక్స్‌ను సరిగ్గా పాటిస్తే సరిపోతుందని అన్నారు. పాకిస్థాన్ జట్టులో మంచి డెప్త్ ఉంది.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడు విభాగాల్లో తక్కువ తప్పులు చేయడమే మన జట్టు విజయానికి ముఖ్యం అని స్పష్టం చేశారు.
తప్పులు అందరూ చేస్తారు.. కానీ తక్కువ తప్పులు చేసే జట్టు మాత్రమే గెలుస్తుంది అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తెలిపారు. బ్యాటింగ్ విషయానికి వస్తే, మొదటి వికెట్లు పడినా భయపడాల్సిన అవసరం లేదు.. మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాటర్లు ఉండటంతో జట్టు తిరిగి నిలబడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇన్నింగ్స్ ఆరంభంలో జాగ్రత్తగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాలి.. చివరి ఓవర్లలో పవర్ హిట్టింగ్ తో పరుగుల వేగం పెంచాలని అఫ్రిది సూచించారు.
ప్రత్యేకంగా పాకిస్థాన్ జట్టు ఓపెనర్లకు షాహిద్ అఫ్రిది ఓ సలహా ఇచ్చారు. రన్ రేట్ పెంచే ప్రయత్నం చేయాలి కానీ తొందరపడి వికెట్లు కోల్పోవద్దని హెచ్చరించాడు. జట్టు సమతుల్యంగా ఆడితే మంచి ఆరంభం దక్కుతుందని పేర్కొన్నాడు. మొత్తానికి, షాహిద్ అఫ్రిది చెప్పిన ప్రకారం, భారీ షాట్ల కంటే కూడా బేసిక్ అంశాల్లో పటిష్టంగా ఉండటం వలన ఇలాంటి కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించడానికి ఈజీ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
