ఇల్లు అంటే బూత్ బంగళా కాదు కదా.. ఇల్లు అంటే ఇంట్లోకి వెలుతురు, గాలి, ఎండ రావాలి కదా.. అలా రాకపోతే దాన్ని బూత్ బంగ్లా అంటారు.. ఇల్లు అంటే ఉదయం, సాయంత్రం ఎండ రావాలి.. గాలి రావాలి.. అది ఎలాంటి ఇల్లు అయినా ఇలాగే ఉండాలి కదా.. పూరిల్లు నుంచి గేటెడ్ కమ్యూనిటీ వరకు ఇంటి నిర్మాణం ఇలా ఉంటేనే దాన్ని ఇల్లు అంటారు.. మరి ఇలాంటి ఇల్లు స్పెషల్ ఎందుకు అవుతుంది.. ఇలాంటి ఇంటికి అద్దె ఎందుకు అంత ఎక్కువ.. ఇప్పుడు ఇదే దేశంలో హాట్ టాపిక్ అయ్యింది.
కర్నాటక రాష్ట్రం బెంగళూరు సిటీ. సిలికాన్ సిటీ. బెంగళూరు సిటీలో అద్దెలు ఎక్కువ.. ఇది అందరికీ తెలిసిందే.. అద్దెలు ఎలా ఎక్కువ.. ఎలాంటి ఇంటికి మరీ మరీ ఎక్కువ అనేది తెలిస్తే మాత్రం నోరెళ్లబెడతారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం కోసం ఇటీవల ఓ మహిళ బెంగళూరు సిటీకి వచ్చింది. ఆమె ఇంటి కోసం చూస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇళ్ల బ్రోకర్ ఆమెను కాంటాక్ట్ అయ్యాడు.. అద్దె నెలకు 80 వేల రూపాయలు అని చెప్పాడు.. డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ కు ఇంత అద్దె ఏంటీ అని ఆమె ఆశ్చర్యపోయింది. దీనికి అతను చెప్పిన సమాధానం షాకింగ్..
మేడమ్.. ఈ అపార్ట్ మెంట్ ఫ్లాట్ కు సూర్యరశ్మి బాగా వస్తుంది.. ఉదయం, సాయంత్రం ఇంట్లోకి ఎండ వస్తుంది.. గాలి బాగా వస్తుంది.. బాల్కనీ ఉంది.. ఇంట్లో బాగా ఎండ వస్తుంది కదా.. అందుకే ఇంటి అద్దె 80 వేల రూపాయలు అని చెప్పాడు.. ఆమె షాక్.. వెలుతురు లేని ఇంటిని ఇల్లు అని ఎలా అంటారు అంటూ రిప్లయ్ ఇచ్చింది. బెంగళూరు సిటీలో ఇంతే.. ఇలాగే ఉంటుంది అంటూ అతను చెప్పటం విశేషం. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టుపై విపరీతమైన కామెంట్స్.. షేర్లు వచ్చాయి. బెంగళూరు సిటీలో ఇంటి అద్దెలపై తమ తమ అనుభవాలను పంచుకున్నారు నెటిజన్లు.
కోరమంగళం ఏరియాలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ప్లాట్ అద్దె 70 వేల రూపాయలుగా ఉందని.. నా ఫ్లాట్ తో పోల్చుకుంటే.. 80 వేల రూపాయల ఫ్లాట్ కు సూర్యరశ్మి.. అదేనండీ ఎండ ఇంట్లోకి రావటం బోనస్ అని.. ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు.
బెంగళూరు సిటీలో ఇంటి ఓనర్లకు అత్యాశ బాగా పెరిగింది. సిటీలో ఇంటిని అద్దెకు తీసుకోవాలంటే ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇంతింత అద్దె చెల్లిస్తున్నా.. రోడ్లు బాగుండటం లేదు.. మురుగు నీళ్లు బయటకు వెళ్లటం లేదు.. క్లీన్ అండ్ గ్రీన్ అస్సలు ఉండటం లేదు.. గత్యంతరం లేక ఉంటున్నాం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Bangalore Rent would never stop surprising me.
— Anu (@Escapeplace__) February 13, 2026
What do you mean “ma’am is room me sunlight bhi aati hai to iska rent ₹80,000 hai” 😭
ఏదిఏమైనా ఇంట్లోకి వెలుతురు రావటం.. గాలి రావటం.. ఎండ రావటం అనేది కూడా ఇప్పుడు అద్దెల పెంపునకు కారణం అవుతుంది అంటే ఆశ్చర్యం కాదు.. నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు. రాబోయే రోజుల్లో గాలి వచ్చే ఇల్లు కూడా వింత కావొచ్చు అంటున్నారు నెటిజన్లు.
