పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్పై సోషల్ మీడియాలో పెను దుమారం రేగడం.. తారిక్ బౌలింగ్ చేస్తున్న తీరుపై కొందరు బహిరంగ విమర్శలు చేస్తుండటంతో ఈ విషయం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. తారిక్ బౌలింగ్ స్టైల్పై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మీడియా ప్రతినిధులు ఎలా ఎదుర్కోబోతున్నారని ప్రశ్నించారు. అయితే.. ఈ ప్రశ్నకు సూర్య చాలా కూల్గా సమాధానం ఇచ్చాడు. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఔట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయని.. అలా అని ఆ ప్రశ్నలను వదిలేయలేం అని సూర్య చెప్పాడు.
Suryakumar Yadav is practicing in the nets by copying Pakistan bowler Usman Tariq’s bowling action. He is bowling to Abhishek Sharma so that the Indian batsmen can get used to that action and hit big sixes against him in the match.💪🔥
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 14, 2026
Team India all set to go own Pakistan.🙌 pic.twitter.com/ONYCT7VSZK
సొల్యూషన్ కోసం కొత్తగా ఆలోచించాలని.. మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలని.. ఆ ప్రకారం హ్యాండిల్ చేయాలని.. ఇప్పుడు తాము కూడా అదే చేస్తామని చెప్పాడు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చాలా భిన్నంగా ఉండొచ్చని.. అలా అని అతని బౌలింగ్కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని సూర్య కుండబద్ధలు కొట్టాడు. అలాంటి బౌలర్లు.. అలాంటి బౌలింగ్ యాక్షన్స్ ఎదుర్కొనేందుకు తాము ఇప్పటికే ప్రాక్టీస్ చేశామని.. ఎలా ఎదుర్కోవాలో అలానే ఎదుర్కొంటామని సూర్య కుమార్ యాదవ్ మీడియాకు తెలిపాడు.
Colombo, Sri Lanka: On strategies against Pakistani bowler Usman Tariq, Indian cricket team's T20 captain Surya Kumar Yadav says, "Sometimes a out of syllabus question comes up in the exam. So we can't ignore it. To tackle it, you have to try something. You have to adopt your own… pic.twitter.com/q6sDI0R3Uf
— ANI (@ANI) February 14, 2026
ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ను ప్రాక్టీస్ చేయడం విశేషం. అభిషేక్ శర్మ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సూర్యకుమార్ ఇలా బౌలింగ్ చేయడం గమనార్హం. ఈ పాక్ బౌలర్ బౌలింగ్ యాక్షన్ కొత్తగా అనిపించొచ్చు గానీ టీమిండియా బ్యాటర్లు ఆ బౌలింగ్ యాక్షన్ను అర్థం చేసుకుని ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో భారీ షాట్లు కొట్టడం ఖాయమని టీమిండియా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ టీం.. ఉస్మాన్ తారిక్పై భారీగానే ఆశలు పెట్టుకుంది.
