కొత్తవారం పెరిగిన గోల్డ్ రేట్లు.. దసరా ముందు గ్రాము ఎంత ఉందంటే?

కొత్తవారం పెరిగిన గోల్డ్ రేట్లు.. దసరా ముందు గ్రాము ఎంత ఉందంటే?

దసరా షాపింగ్ దేశవ్యాప్తంగా జోరందుకున్న వేళ బులియన్ మార్కెట్లు మళ్లీ తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రధానంగా వెండి రేట్లు కొంత స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ.. గోల్డ్ రేట్లు మాత్రం వారం రోజుల తగ్గుదల తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఆభరణాల షాపింగ్ చేస్తున్న రిటైల్ కొనుగోలుదారులు ముందుగా తమ సమీపంలోని నగరాల్లో అమ్మకపు రిటైల్ ధరలను పరిశీలించటం బెటర్. 

అక్టోబర్ 19న బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.38 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 804గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 570గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 19, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.