రూ.31,637 కోట్ల సమీకరణే లక్ష్యం.. జియో ఐపీఓతో ప్రైమరీ మార్కెట్‌లో జోష్

రూ.31,637 కోట్ల సమీకరణే లక్ష్యం.. జియో ఐపీఓతో ప్రైమరీ మార్కెట్‌లో జోష్
  •    రూ.31,637 కోట్ల సేకరణ
  •     నేటితో ముగియనున్న 4 మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్ ఐపీఓలు
  •  

ముంబై: ప్రైమరీ మార్కెట్ ఐపీఓలతో కళకళలాడనుంది. ఈ వారం ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ విభాగంలో కొత్త ఐపీఓలు లేకపోయినా, కేవలం 2  మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్ ఐపీఓలే ఏకంగా రూ.31,637.6 కోట్ల నిధులను సేకరించనున్నాయి.  మరో 4 మెయిన్‌‌‌‌‌‌‌‌బోర్డ్ ఐపీఓలు సోమవారంతో ముగియనున్నాయి. కాగా, దసరా సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు.

   జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ  జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్ ఏకంగా రూ.30,187.6 కోట్ల ఫ్రెష్ ఇష్యూతో వస్తోంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓ. ఇప్పటివరకు  హ్యుందాయ్ రూ.27,859 కోట్ల ఇష్యూ  అతిపెద్ద ఐపీఓగా కొనసాగింది. జియో ఐపీఓ  అక్టోబర్ 21, 22, 23 తేదీల్లో బిడ్డింగ్ కోసం ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ రూ.1,065–1,119. కనీస పెట్టుబడి 1 లాట్ (12 షేర్లు) కు రూ.13,428.  ఈ టెలికాం కంపెనీ షేర్లు  గ్రే మార్కెట్లో  21శాతం ప్రీమియంతో 
ట్రేడవుతున్నాయి.  

  పారస్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్

హాస్పిటల్స్  చైన్ పారస్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్  అక్టోబర్ 21 న ఐపీఓకు రానుంది. ప్రైస్ బ్యాండ్ రూ.660–693 వద్ద రూ.1,450 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.500 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రూ.650 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఉన్నాయి. ఈ కంపెనీ  నార్త్ ఇండియాలో   8 హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తోంది. జీఎంపీ 14శాతంగా ఉంది.
 జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సహజానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫిగ్లియోలి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టోన్బో ఇమేజింగ్ ఇండియా ఐపీఓలు సోమవారంతో ముగియనున్నాయి.