110 డాలర్లకు చేరిన బ్రెంట్
న్యూఢిల్లీ : కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) అమ్మకాలు ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయిస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. షార్ట్ కవరింగ్ కారణంగా గత వారం సెన్సెక్స్ 2,257 పాయింట్లు (3.11 శాతం), నిఫ్టీ 626 పాయింట్లు (2.77 శాతం) ఎగిశాయి. కానీ, మార్కెట్ లాభాలకు ఈ వారం బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 110 డాలర్లకు చేరడంతో మార్కెట్‌లో వోలటాలిటీ పెరగొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
జియో ఐపీఓ ఈ నెల 21 న ఓపెన్ కానుండగా, ఈ ఐపీఓ కారణంగా మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గొచ్చని, ఇన్వెస్టర్లు జియో షేర్లు కొనడానికి ఎగబడొచ్చనే ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు వారాంతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు మెరుగైన లాభాలు ప్రకటించడంతో బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఈ వారం బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, స్విగ్గీ ఫలితాలు వెలువడనున్నాయి. గ్లోబల్‌గా చూస్తే అమెరికా బాండ్ ఈల్డ్స్ రికార్డ్ లెవెల్‌కు పెరగడం, క్రూడాయిల్ ధరలు 110 డాలర్లకు చేరడం, ఇరాన్ యుద్ధం వంటివి మార్కెట్ డైరెక్షన్‌ను ప్రభావితం చేస్తాయి. డాలర్‌తో రూపాయి బలంగా ఉండడం, ఎఫ్‌ఐఐలు శుక్రవారం కొనుగోళ్లు జరపడం కొంత ఊరటనిచ్చే అంశం.
