కొడిమ్యాల, వెలుగు : బతుకమ్మ పండుగ రోజు తాగు నీరు రాకపోవడంతో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో మూడు రోజులుగా మూడు వార్డుల్లో మంచినీరు రావడం లేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు గ్రామపంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఆదివారం బతుకమ్మ పండుగ రోజున కూడా నీళ్లు రాకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి ధర్నా చేశారు. సుమారు 30 మంది మహిళలు ధర్నా చేయడంతో జీపీ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
