మహాశక్తి ఆలయంలో సంజయ్, పొన్నం పూజలు.. సమృద్దిగా వర్షాలు కురవాలి.. తెలంగాణలో పంటలు పండాలి

మహాశక్తి ఆలయంలో సంజయ్, పొన్నం పూజలు.. సమృద్దిగా వర్షాలు కురవాలి.. తెలంగాణలో పంటలు పండాలి

కరీంనగర్, వెలుగు:  శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌‌లోని శ్రీమహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌తో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 శ్రీదుర్గాదేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. 

ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నారు. 

ఆ తర్వాత పొన్నం కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శ్రీ దుర్గా భవాని దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిగురుమామిడి మండలం కొండాపూర్‌‌లో మంత్రి బతుకమ్మ ఘాట్లను ప్రారంభించారు.