హైదరాబాద్: లేబర్ బోర్డుపై వస్తున్న ఆరోపణలపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. లేబర్ బోర్డుపై వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. 2018 నుంచి జరిగిన చెల్లింపులపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లేబర్ బోర్డు చెల్లింపులపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ..అయితే, కేంద్రం లేఖ రాసిన సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. విచారణ పూర్తయ్యాక వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.
తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ లేబర్ బోర్డులో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టామని ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామన్నారు మంత్రి. నకిలీ డెత్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2018 నుంచి జరిగిన చెల్లింపులు, అక్రమాలపై విచారణ జరిపిస్తున్నామని, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి రిపోర్టులు అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. లేబర్ కమిషనర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
మరోవైపు సింగరేణి అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. సరైన సమాచారం లేకుండానే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో సింగరేణి ఆదాయం ఎంత ఉంది.. ప్రస్తుతం ఎంత ఆదాయం వస్తోందనే అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి ఉద్యోగుల సంఖ్య లక్ష నుంచి 38 వేలకు తగ్గిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఒక్క బొగ్గు గనిని కూడా తీసుకురాలేకపోయిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి వేలంలో పాల్గొని బొగ్గు గనులు దక్కించుకున్నామని, తాడిచెర్ల మైన్ కూడా తమ కృషితోనే సాధ్యమైందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణి ఆదాయం పెరిగిందని హరీశ్ రావు కూడా అంగీకరించారని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో అర్థం కాని పరిస్థితి ఉందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఖర్చులు, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బొగ్గు గని సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)ను బలహీనపరిచి, చివరికి ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బొగ్గు ఉత్పత్తిని తగ్గించి, దానిని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని, బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని బొగ్గు కార్మికులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హయాంలో సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను తగ్గించారని, దసరా బోనస్‌ను సరిగ్గా చెల్లించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ బోర్డులను సరిగ్గా నిర్వహించడం లేదని, నెలకు మూడు సార్లు వైద్య బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టెండర్లు, డీజిల్ కొనుగోళ్లు, డిటోనేటర్లు, ఓవర్‌బర్డెన్ (OB) కాంట్రాక్టుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు కేటీఆర్.
ఉద్యమానికి ముందు 22ఎకరాలు.. పదేళ్ల పాలన తర్వాత 400ఎకరాలు ఎట్లయింది?: మంత్రి వివేక్ వెంకటస్వామి
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ జరుగుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉద్యమానికి ముందు కేసీఆర్‌కు 22 ఎకరాల భూమి ఉండగా, ఉద్యమ సమయంలో అది 47 ఎకరాలకు పెరిగిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 400 ఎకరాలు దాటిందని ఆరోపించారు. కేసీఆర్‌పై తనకు ఎలాంటి కోపం లేదని, కేసీఆర్, కేటీఆర్ తన దోస్తులేనని అన్నారు. కేటీఆర్ తనకు యువరాజు లాంటి వారని వ్యాఖ్యానిస్తూ, భూముల వ్యవహారంలో ప్రభుత్వం చట్టప్రకారమే ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
►ALSO READ | బహుజన కెరటాలకు గౌరవం ఏది.. పోరాటంలో ఓయూ..