బహుజన కెరటాలకు గౌరవం ఏది.. పోరాటంలో ఓయూ..

బహుజన కెరటాలకు గౌరవం ఏది.. పోరాటంలో ఓయూ..

మంద కృష్ణమాదిగ, గజ్జెల కాంతం, ఉద్యోగ నాయకుడు చంద్రశేఖర్ గౌడ్, పద్మాచారి ఉన్నారు. గిరిజన సంఘాల నేతగా ఉన్న బెల్లయ్య నాయక్‌కు సొంత రాష్ట్రంలో దశాబ్దం తర్వాత ఈమధ్యే కార్పొరేషన్ పదవి వచ్చింది. తెలంగాణ కోసమే పాటలు రాసిన గూడ అంజయ్య సొంత రాష్ట్రంలో ఏ గౌరవం లేకుండా కన్నుమూశారు. ఉద్యమానికి ఊతంగా నిలిచినవారిలో జయరాజు, యశ్ పాల్, వందేమాతరం శ్రీనివాస్, నేర్నాల కిశోర్, అంతడ్పుల నాగరాజు, తేలు విజయ, అశ్విని లాంటివాళ్లున్నారు. తెలంగాణ వచ్చాక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బండి యాదగిరి, సుద్దాల కుటుంబం, గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న, ఎక్కా యాదగిరి, పాశం యాదగిరి, గోరెటి, జయరాజు సేవలకు కోటి రూపాయల కానుక అందించింది.

పోరాటంలో ఓయూ 

కదిలిందిరా ఉస్మానియా.. ఖబడ్ధార్.. ఖబడ్దార్ అంటూ లాఠీలకు వెరువక.. టియర్ గ్యాస్ పొగలను చీల్చుకుంటూ ముందుకు ఉరికిన ఘన చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయానిది. వరంగల్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది కాకతీయ వర్సిటీ.  కానీ రాష్ట్రం వచ్చాక విద్యార్థి నాయకులు ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయారు. 

►ALSO READ | ప్రజా తెలంగాణ కోసం పోరుబాట... పార్టీలు వేరైనా.. అందరి లక్ష్యం ఒక్కటే.. 

ఓయూ కేంద్రంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినవారిలో రాజారాం యాదవ్, వరంగల్ రవి, మందాల భాస్కర్, మానవతారాయ్, దరువు ఎల్లన్న, దరువు అంజన్న, దుర్గం భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్, రాజేశ్ నాయక్, మర్రి అనిల్, కైలాష్ నేత, కోట శ్రీనివాస్, స్టాలిన్, టీవీవీ విజయ్, శ్రీహరి, కరాటే రాజు, సురేందర్ గౌడ్, కంచర్ల బద్రి, డాక్టర్ ఎస్.హరినాథ్, డాక్టర్ కాటం శ్రీధర్, ఆర్.ఎన్.శంకర్, ఎం.వీరస్వామి, ఆశప్ప, ఆజాద్ లాంటివాళ్లు ఉన్నారు. 

కేయూ విద్యార్థి నేతగా ఉన్న యాకూబ్ రెడ్డి ఉద్యమంలో పోలీసుల చేతిలో టార్చర్ ఎదుర్కొని చావు అంచుదాకా వెళ్లారు. వీరందరికీ తగిన గౌరవం దక్కలేదు. ఓయూ విద్యార్థి నేతలుగా ఎదిగినవారిలో బాల్క సుమన్, గాదరి కిశోర్ మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. పిడమర్తి రవి, క్రిశాంక్, ఆంజనేయులుగౌడ్, బాలరాజ్ యాదవ్, బాలలక్ష్మి లాంటివారు నామినేటెడ్ పోస్టులు పొందారు.