ఎల్నినో ప్రభావం: ఇక తాగునీటి అవసరాలకే ఎస్సారెస్పీ నీరు

ఎల్నినో ప్రభావం: ఇక తాగునీటి అవసరాలకే ఎస్సారెస్పీ  నీరు
  •  ప్రభుత్వ విప్ విజయ రమణారావు 

సుల్తానాబాద్, వెలుగు: ఎల్​నినో ప్రభావం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు ఇక తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గురువారం 140 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే యాసంగి పంట కాలానికి గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. రైతులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిపై ఆశలు పెట్టుకోవద్దని, ఈసారి ప్రాజెక్టులోని నీటిని కేవలం తాగు నీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి బట్టలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. 

భూపతిపూర్ ఉపసర్పంచ్ కవ్వంపల్లి కార్తీక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్​రావు, సింగిల్ విండో చైర్మన్లు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.