అమెరికాలో ఘోరం జరిగింది. ఒరెగాన్ రాష్ట్రంలోని ఓ స్కూల్ లో కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండుగుడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారుల తో సహా ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరాన్ని చూసిన అటుగా వెళ్తున్న స్థానికుడు దుండగుడిని హతమార్చాడు. గురువారం (అక్టోబర్ 15) బెండ్ సిటీలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్ లో ఈ ఘటన జరిగింది.కాల్పులు జరిపిన వ్యక్తి 16 ఏళ్ల బాలుడని పోలీసుల గుర్తించారు.
పోలీసుల ప్రకారం.. తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరిపి లోపలికి వెళ్లి మరీ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కాల్పుల అనంతరం పారిపోతుండగా ఓ స్థానికులు వెంబడించి నిందితుడిని పట్టుకున్నాడు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో నిందితుడిని స్థానికుడు హతమార్చినట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంట్జ్ తెలిపారు. మృతులలో ఐదు, ఎనిమిది, 11 ఏళ్ల బాలురు, 54ఏళ్ల టీచర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు కారణాలేంటో ఇంకా తెలిసిరాలేదు.
