రేపు (అక్టోబర్ 17న) నగరంలో ఏఐపీటీఎఫ్ దక్షిణ భారత సదస్సు

రేపు (అక్టోబర్ 17న) నగరంలో ఏఐపీటీఎఫ్ దక్షిణ భారత సదస్సు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల17న హైదరాబాద్​లో అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) దక్షిణ భారత రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం జరగనుందని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌‌‌‌‌‌‌‌పీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్. రోహిత్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఐఏఎస్ ఎస్. బాలసుబ్రహ్మణ్యంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అటెండ్ కానున్నారని చెప్పారు. ఈ సదస్సులో ప్రధానంగా ‘ప్రాథమిక విద్య - ప్రస్తుత పరిస్థితి - నివారణ/సంస్కరణ చర్యలు’ అనే అంశంతో పాటు నూతన విద్యావిధానం, దక్షిణ భారత సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ చర్యలు అనే దానిపై చర్చించనున్నట్టు చెప్పారు. సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఒక సమగ్ర నివేదికను రూపొందించి, దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమర్పిస్తామని తెలిపారు.