యాంపియర్ ఎక్స్పీరియెన్స్ సెంటర్.. నల్గొండలో ప్రారంభం

యాంపియర్ ఎక్స్పీరియెన్స్ సెంటర్.. నల్గొండలో ప్రారంభం

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ యాంపియర్ నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో ఎస్ఎన్ మోటార్స్ పేరుతో కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  ఇక్కడ అమ్మకాలను,  సేవలను అందిస్తారు. ఈ షోరూమ్​లో యాంపియర్  స్కూటర్లను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ప్రధానమైన యాంపియర్ నెక్సస్ ఈఎక్స్ ప్లస్ స్కూటర్ 5 కిలోవాట్ల మోటార్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది.   నెక్సస్ ఈఎక్స్ ప్లస్, మాగ్నస్ జీమ్యాక్స్ స్కూటర్లలో 30కి పైగా స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటికి ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది.