రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గను.. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై: సికందర్ రజా

రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గను.. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై: సికందర్ రజా

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ తర్వాత ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు  రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటిస్తానని జింబాబ్వే వన్డే, టీ20 కెప్టెన్‌‌‌‌ సికందర్‌‌‌‌ రజా స్పష్టం చేశాడు.  ఒకవేళ 2027–30 సైకిల్‌‌‌‌లో జింబాబ్వే టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లోకి ప్రవేశించినా తన నిర్ణయాన్ని మార్చుకోబోనని తెలిపాడు. ‘సొంత గడ్డపై వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌తో కెరీర్‌‌‌‌కు ముగించడం నాకు దక్కే అదృష్టం. రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకునే అలవాటు లేదు.

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మాకు హోమ్‌‌‌‌ అడ్వాంటేజ్‌‌‌‌ ఉంటుంది. మా శక్తి మేరకు ఆడేందుకు కృషి చేస్తాం’ అని రజా పేర్కొన్నాడు. టెస్ట్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లోకి జింబాబ్వే ప్రవేశిస్తే తమ దేశ క్రికెట్‌‌‌‌ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశాడు. కేవలం టెస్ట్‌‌‌‌లే కాకుండా అన్ని విభాగాల్లోనూ ప్రదర్శన మెరుగవుతుందన్నాడు. 2027 అక్టోబర్ 24న ఇండియాతో జరిగే మ్యాచ్ విక్టోరియా ఫాల్స్‌‌‌‌లోని కొత్త మోసి-ఓ-తున్యా ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం ప్రారంభం కానుండటం పట్ల రజా సంతోషం వ్యక్తం చేశాడు.