షాంఘై మాస్టర్స్ సెమీస్‌కు జ్వెరెవ్.. డి మినార్‌పై వరుస సెట్లలో విజయం

షాంఘై మాస్టర్స్ సెమీస్‌కు జ్వెరెవ్.. డి  మినార్‌పై వరుస సెట్లలో విజయం

షాంఘై: జర్మనీ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌.. షాంఘై మాస్టర్స్‌‌‌‌ టోర్నీలో సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌ 6–4, 6–4తో అలెక్స్‌‌‌‌ డి మినార్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో గెలిచాడు.

తొలి సర్వీస్‌‌‌‌ల్లో 80 శాతం పాయింట్లు రాబట్టిన జ్వెరెవ్‌‌‌‌.. ఐదు బ్రేక్‌‌‌‌ పాయింట్లను విజయవంతంగా కాపాడుకున్నాడు. సెమీస్‌‌‌‌లో జ్వెరెవ్‌‌‌‌.. అలెజాండ్రో డేవిడోవిచ్‌‌‌‌ ఫోకినా (స్పెయిన్‌‌‌‌)తో తలపడనున్నాడు. క్వార్టర్స్‌‌‌‌లో ఆర్థర్‌‌‌‌ గియా (ఫ్రాన్స్‌‌‌‌) తొలి సెట్‌‌‌‌లో 4–1తో ఉన్నప్పుడు గాయం కారణంగా వైదొలగడంతో ఫోకినాకు వాకోవర్‌‌‌‌ విజయం లభించింది. ఫోకినాతో ముఖాముఖి రికార్డులో జ్వెరెవ్‌‌‌‌ 6–1తో ముందంజలో ఉన్నాడు.