జూనియర్ ఖో ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి బాలికల జట్టు బోణీ

 జూనియర్ ఖో ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి బాలికల జట్టు బోణీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కోట్ల రామకృష్ణ స్మారక తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్‌‌‌‌ ఇంటర్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌  ఖో ఖో చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో రంగారెడ్డి బాలికల జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో రంగారెడ్డి 32–12తో నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌పై గెలిచింది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో వరంగల్‌‌‌‌ 29–25తో కరీంనగర్‌‌‌‌పై, పెద్దపల్లి 30–18తో మెదక్‌‌‌‌పై, ఖమ్మం 40–23తో నిజామాబాద్‌‌‌‌పై నెగ్గాయి.

బాలుర విభాగంలో వరంగల్‌‌‌‌ 29–19తో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌పై, మెదక్‌‌‌‌ 35–32తో నల్గొండపై, పెద్దపల్లి 33–27తో ఖమ్మంపై, నిజామాబాద్‌‌‌‌ 43–22తో నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌పై గెలిచి ముందంజ వేశాయి. తెలంగాణ చిన్నారులు క్రీడల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని టోర్నీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ఒలింపిక్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి పి. మల్లారెడ్డి అన్నాడు.