ఆర్టీసీలో కొనసాగుతున్న దసరా రద్దీ..అక్టోబర్ 9 నుంచి 14 వరకు 2,474 బస్సులను నడిపిన సంస్థ

ఆర్టీసీలో కొనసాగుతున్న  దసరా రద్దీ..అక్టోబర్ 9 నుంచి 14 వరకు 2,474 బస్సులను నడిపిన సంస్థ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో దసరా రద్దీ కొనసాగుతోంది. ఈ నెల 9 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,474 బస్సులను నడపడం ద్వారా 94. 07 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు గురువారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా బస్సులు నడిపినట్లు ఆయన వివరించారు. 

ఈ నెల 16, 17 తేదీల్లో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందుకు అవసరమైన బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా ప్రజలు ఆర్టీసీ బస్సులను మాత్రమే వినియోగించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ముందస్తు రిజర్వేషన్లను సంస్థ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.