అండర్‌–23 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విశ్వజిత్ మోరే చరిత్ర.. భారత్‌కు తొలి రజతం

అండర్‌–23 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విశ్వజిత్ మోరే చరిత్ర.. భారత్‌కు తొలి రజతం

లాస్‌‌‌‌వెగాస్‌‌‌‌ (అమెరికా): ఇండియా రెజ్లర్‌‌‌‌ విశ్వజిత్‌‌‌‌ మోరే.. అండర్‌‌‌‌–23 రెజ్లింగ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన గ్రీకో రోమన్‌‌‌‌ 55 కేజీ విభాగం ఫైనల్లో విశ్వజిత్‌‌‌‌ 12–13 తేడాతో కోబా కరుమిడ్జ్‌‌‌‌ (జార్జియా) చేతిలో ఓడి రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. అయితే ఈ విభాగంలో ఇండియాకు సిల్వర్‌‌‌‌ దక్కడం ఇదే తొలిసారి. మెక్సికో రెజ్లర్‌‌‌‌ ఐజాక్‌‌‌‌ మారిన్‌‌‌‌ మటాతో జరిగిన తొలి బౌట్‌‌‌‌లో 10–8 తేడాతో నెగ్గిన మోరే.. క్వార్టర్‌‌‌‌ఫైనల్లో 8–1తో ఆర్మిన్‌‌‌‌ షాంసిపూర్‌‌‌‌ను ఓడించాడు.

ఈ పోరులో ఇరాన్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ ఎడమ భుజానికి గాయం కావడంతో మోరేకు విజయం సులువైంది. సెమీస్‌‌‌‌లో 7–4తో మాలిక్‌‌‌‌ గిజివ్ (రష్యా)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. చేతన్‌‌‌‌ (63 కేజీ) ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ఓడగా, కరన్‌‌‌‌ కాంబోజ్‌‌‌‌ (87 కేజీ) క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనే వెనుదిరిగాడు. విమెన్స్ కేటగిరీలో దీక్షా మాలిక్‌‌‌‌, కోమల్‌‌‌‌ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. మానసి లూథర్‌‌‌‌ (68 కేజీ) క్వార్టర్స్‌‌‌‌లో 9–10 తేడాతో లారా గొడిన్‌‌‌‌ (ఇటలీ) చేతిలో ఓడింది.