న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లాంటి మెగా టోర్నీలు ఉండటంతో బుమ్రాను ఫిట్‌గా ఉంచేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.
కివీస్‌తో టెస్ట్ సిరీస్‌కు అతన్ని అందుబాటులో ఉంచనున్నారు. ‘బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కివీస్ పర్యటన చాలా సుదీర్ఘంగా సాగనుంది. అందుకే వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్స్, బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఉన్నాయి. కాబట్టి పరిమిత ఓవర్లలో ఎక్కువగా ఆడించకుండ టెస్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 22 నుంచి నవంబర్ 27 వరకు జరిగే కివీస్ టూర్లో టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది.
