హైదరాబాద్‌ ‌‌‌‌‌‌‌లో అప్టొమా 4కే ప్రొజెక్టర్లు, డిస్ప్లేలు

హైదరాబాద్‌ ‌‌‌‌‌‌‌లో అప్టొమా 4కే ప్రొజెక్టర్లు, డిస్ప్లేలు

హైదరాబాద్, వెలుగు: ప్రొజెక్షన్, డిస్‌‌‌‌‌‌‌‌ప్లే టెక్నాలజీ సంస్థ అప్టొమా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గురువారం హోమ్ సినిమా ప్రొజెక్టర్ యుహెచ్‌‌‌‌‌‌‌‌ఆర్90డీవీ, లేజర్ ప్రొజెక్టర్ పీకే52, స్టూడియో సిరీస్ ప్రొఫెషనల్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లేలను ప్రదర్శించింది. ప్రీమియం హోమ్ సినిమా కోసం రూపొందించిన యుహెచ్‌‌‌‌‌‌‌‌ఆర్90డీవీ 4కే ప్రొజెక్టర్ ట్రిపుల్ లేజర్ ఆర్‌‌‌‌‌‌‌‌జీబీ టెక్నాలజీతో 5,000 లూమెన్స్ బ్రైట్‌‌‌‌‌‌‌‌నెస్ అందిస్తుంది. 

ఇందులో డాల్బీ విజన్, హెచ్‌‌‌‌‌‌‌‌డీఆర్10 ప్లస్, ఐమ్యాక్స్ ఎన్‌హాన్స్‌‌‌‌‌‌‌‌డ్ ఫీచర్లతో పాటు గేమింగ్ కోసం 8.5 మిల్లీసెకన్ల ఇన్‌‌‌‌‌‌‌‌పుట్ ల్యాగ్ ఉంది. రోజువారీ వినోదం కోసం తెచ్చిన ఫోటాన్ బీమ్ పీకే52 ప్రొజెక్టర్ 3,500 లూమెన్స్ బ్రైట్‌‌‌‌‌‌‌‌నెస్, 30 వేల గంటల లేజర్ లైఫ్, 15 వాట్ల స్పీకర్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. ఇది 300 అంగుళాల వరకు స్క్రీన్ సైజును అందిస్తుంది. వాణిజ్య అవసరాల కోసం ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎన్ సిరీస్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లేలను 75, 86, 98 అంగుళాల సైజుల్లో 500 నిట్స్ బ్రైట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో రూపొందించారు.