ఏరోస్పేస్, సూపర్ అలాయ్స్ కోసం ..యూకే సంస్థతో రఘువంశీ ఒప్పందం

ఏరోస్పేస్, సూపర్ అలాయ్స్ కోసం ..యూకే సంస్థతో రఘువంశీ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: ఏరోస్పేస్ , సూపర్ అలాయ్స్ రంగంలో భారత్, యూకే మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రఘువంశీ గ్రూప్ కీలక ఒప్పందం చేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌‌‌‌‌‌‌‌కు చెందిన అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఏఎంఆర్‌‌‌‌‌‌‌‌సీ)తో ఎంఓయూ కుదుర్చుకుంది. 

తెలంగాణలో రఘువంశీ గ్రూప్ ఏర్పాటు చేయబోయే సూపర్ అలాయ్స్ తయారీ కేంద్రం, ఆర్ అండ్ డీ సెంటర్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ భాగస్వామ్యం అందిస్తుంది. సింగిల్ క్రిస్టల్ కాస్టింగ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న ఏఎంఆర్‌‌‌‌‌‌‌‌సీతో కలిసి పనిచేయడం వల్ల తెలంగాణను సూపర్ అలాయ్స్ రంగంలో గ్లోబల్ లీడర్‌‌‌‌‌‌‌‌గా మార్చగలమని రఘువంశీ గ్రూప్ ఎండీ వంశీ వికాస్ గణేశుల తెలిపారు.

 ఈ ఒప్పందం ద్వారా గ్రూప్ అనుబంధ సంస్థ పీటీ పీఎంసీ యూకే కార్యకలాపాల్లో ఆధునిక డిజిటల్ పద్ధతులను ప్రవేశపెడతారు. ఇరు దేశాల మధ్య సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఇంజనీరింగ్ ప్రతిభను ప్రోత్సహించేందుకు శిక్షణ  ఇస్తారు.