హైదరాబాద్, వెలుగు : ఎల్ఐసీ మూడు కొత్త పాలసీలను లాంచ్ చేసింది. ఇవి ఈ నెల 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఎల్ఐసీ నయీ జీవన్ ధార- 2 పాలసీతో రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం గ్యారెంటీడ్ పెన్షన్ పొందొచ్చు.
ఈ పాలసీ తీసుకున్నప్పుడే పెన్షన్ రేటును నిర్ణయించొచ్చు. టాప్అప్ ఆప్షన్ ఉంది. ఈ పాలసీ కొనేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. రెండో పాలసీ ఎల్ఐసీ హెల్త్ షీల్డ్. హాస్పిటల్ ఖర్చుల కోసం ఒకేసారి డబ్బులు అందుతాయి. కాలపరిమితి 15 ఏళ్లు. మూడో ప్లాన్ ఎల్ఐసీ న్యూ క్యాన్సర్ కవర్. క్యాన్సర్ నిర్ధారణ కాగానే నేరుగా ఆర్థిక సహాయం అందించే పాలసీ ఇది.
