పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు..పంటలు ఎండిపోయిన రైతులకు న్యాయం చేస్తాం

పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు..పంటలు ఎండిపోయిన రైతులకు న్యాయం చేస్తాం
  •     ఎంపీ డాక్టర్ మల్లు రవి

అచ్చంపేట, వెలుగు : సూపర్ ఎల్ నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితుల నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, పంటలు ఎండిపోయిన రైతులకు తగిన నష్టపరిహారం  అందనుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. 

గురువారం అచ్చంపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపాల గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శివ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అచ్చంపేట, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డితో కలిసి ఆయన   హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత 150 ఏండ్ల కింద వచ్చిన సూపర్ ఎల్ నినో పునరావృతం కానుండటంతో తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, నేతలు గిరి వర్ధన్ గౌడ్, సలేశ్వరం, రాంప్రసాద్ గౌడ్,  వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.