- లిస్టు విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
హైదరాబాద్, వెలుగు: కాళోజీ హెల్త్ వర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కన్వీనర్ కోటా కింద యూజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హులైన అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 45 మంది అభ్యర్థులు ఉన్నట్టు వెల్లడించింది. నాన్- లోకల్ , సర్టిఫికెట్లు సరిగా అప్లోడ్ చేయకపోవడం వంటి రిమార్క్స్ గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
అభ్యర్థులు తమ ఆధారాలను శనివారం ఉదయం 8 గంటలలోపు [email protected] ఈమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎలాంటి అభ్యంతరాలు, క్లెయిమ్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.
